ఇరాన్తో అణు ఒప్పందం కోసం చర్చలు కొనసాగుతున్నాయి: ఖతార్
- July 01, 2025
దోహా: ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణతో మిడిలీస్ట్ లో ఉద్రిక్తత ముగిసిన తర్వాత, ఇరాన్ అణు ఫైలుపై ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలలో ఖతర్ తీవ్రంగా ప్రయత్నస్తుందని ఖతార్ ప్రధానమంత్రి సలహాదారు, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్ మజేద్ బిన్ మొహమ్మద్ అల్-అన్సారీ తెలిపారు.
అయితే, గాజాలో కాల్పుల విరమణ గురించి ప్రస్తుతం ఎటువంటి చర్చలు జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. "ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రయోజనాలతో పాటు, ఖతర్ ఆసక్తి ఇప్పుడు ఇరాన్ -యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య విస్తృత అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడం వైపు మళ్ళించాము." అని అన్నారు. అణు ఒప్పందం విషయంలో వివిధ పార్టీలతో ఖతార్ ప్రతిరోజూ సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.
ప్రస్తుత ఇజ్రాయెల్ సైన్యం కారణంగా గాజాలో జరుగుతున్న మానవతా విపత్తును అల్-అన్సారీ ఖండించారు. "ఈ సంక్షోభం దాదాపు రెండు సంవత్సరాలుగా కొనసాగుతుంది. దీనికి ఒక పరిష్కారాన్ని చూపాల్సి బాధ్యత అంతర్జాతీయ సమాజంపై ఉంది." అని పేర్కొన్నారు. గాజాపై చర్చలను తిరిగి ప్రారంభించడం కోసం అమెరికాను ఒప్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







