‘హదత’ను ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!

- July 02, 2025 , by Maagulf
‘హదత’ను ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!

మస్కట్: సుల్తాన్ ఖబూస్ విశ్వవిద్యాలయం (SQU) సహకారంతో ఒమన్ రవాణా, కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ  ‘హదత’ అనే సైబర్ భద్రతా కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రం సైబర్ భద్రతా రంగంలో పరిశోధన, ఆవిష్కరణ, అభివృద్ధిని ప్రోత్సహించనుంది. జాతీయ ఆవిష్కరణలకు ఇది కేంద్రంగా పనిచేస్తుందని మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ అలీ బిన్ అమెర్ అల్ షిధాని తెలిపారు.

ఈ సందర్భంగా “హదత” సైబర్ భద్రతా కేంద్రం గురించిన వివరాలను ప్రదర్శించారు. “హదాతా” ద్వారా అరబ్ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ రంగంలో ఒమన్ కీలక ముందడుగు వేసిందని వక్తలు కొనియాడారు. సాంకేతిక పెట్టుబడులను పెంచడం, సాంకేతికతలను స్థానికీకరించడం, ఒమానీ యువత నైపుణ్యాలను అభివృద్ధి చేయడం,  ప్రపంచవ్యాప్తంగా పోటీపడే సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఈ కేంద్రం పనిచేస్తుందని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com