ఫైలాకా ద్వీపంలో మునిసిపాలిటీ తనిఖీలు ప్రారంభం..!!

- July 02, 2025 , by Maagulf
ఫైలాకా ద్వీపంలో మునిసిపాలిటీ తనిఖీలు ప్రారంభం..!!

కువైట్: కువైట్ మునిసిపాలిటీలోని ఇంజనీరింగ్ ఆడిట్ విభాగం అధికారులు.. ఫైలాకా ద్వీపంలో ఇంజనీరింగ్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు వారు ప్రత్యేకంగా తనిఖీలు ప్రారంభించారు. వివిధ వర్గాల నుంచి భారీగా అందిన ఫిర్యాదులకు ప్రతిస్పందనగా తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ప్రభుత్వ యాజమాన్యంలోని భూమిపై ఆక్రమణకు సంబంధించిన అనేక కేసులలో ఉల్లంఘనలను గుర్తించినట్లు మునిసిపాలిటీ తనిఖీ బృందం తెలిపింది. ఉల్లంఘనలకు పాల్పడిన వారికి హెచ్చరికలు జారీ చేసినట్లు, హెచ్చరిక వ్యవధి ముగిసిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తనిఖీల సందర్భంగా గుర్తించిన అన్ని ఉల్లంఘనలను పరిష్కరించడానికి,  ప్రజా ఆస్తులను రక్షించడానికి అవసరమైన చట్టపరమైన విధానాలతో  ముందుకు సాగుతున్నట్లు మునిసిపాలిటీ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com