తెలంగాణ రవాణాశాఖ అన్ని సేవలను ఆన్‌లైన్ ద్వారా అందించేందుకు రంగం సిద్ధం
- July 14, 2016
వాహనదారులకు శుక్రవారం నుంచి తెలంగాణ రవాణాశాఖ అన్ని సేవలను ఆన్‌లైన్ ద్వారా అందించేందుకు రంగం సిద్ధం చేసింది. అన్ని సేవలకు ముందస్తుగా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకునే సదుపాయం కల్పించనుంది. డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్లు, వాహన సామర్థ్యం పత్రాలు ఆన్‌లైన్‌లో పొందవచ్చు. వీటితో పాటు వాహన యాజమాన్య బదిలీ, అనుమతి పునరుద్ధరణ తదితర అన్నీ సేవలకు ఆన్‌లైన్ వేదిక కానుంది. రవాణాశాఖ ఇప్పటికే 15 రకాల సేవలను ఆన్‌లైన్ ద్వారా అందిస్తోంది. కాగా మిగిలిన 42 రకాల సేవలను అదే పద్ధతిలో అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఆర్టీఏ కార్యాలయంలో స్లాట్‌బుకింగ్ తర్వాత నిర్ణీత సమయంలో సేవలు పొందే అవకాశం ఉంది.
నగర సమస్యలు యాప్ ద్వారా ఫిర్యాదులు ఇక నుంచి హైదరాబాద్ నగరంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలను మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మొబైల్ యాప్ ఫిర్యాదుల ఆధారంగా సమస్యల పరిష్కారంపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







