ఖతార్ లో లివర్ క్యాన్సర్ పై అవగాహన క్యాంపెయిన్..!!
- July 07, 2025
దోహా: లివర్ క్యాన్సర్ అవగాహన మాసాన్ని ఖతార్ క్యాన్సర్ సొసైటీ (QCS) నిర్వహిస్తుంది. జులై నెలంగా “మిమ్మల్ని మీరు రక్షించుకోండి” అనే అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. ఖతార్ రెడ్ క్రెసెంట్ సహకారంతో అల్-హెమైలా హెల్త్ సెంటర్, మెసైమీర్ హెల్త్ సెంటర్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కార్మికులను లక్ష్యంగా చేసుకుని నిర్వహిస్తున్నారు.
హెపటైటిస్ బి లేదా సి వైరస్లకు గురికావడం లేదా కార్యాలయంలో ప్రమాదకరమైన రసాయనాలతో పనిచేయడం, ఇది కాలక్రమేణా కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు పేర్కొన్నారు. నివారణ చర్యలను పాటించడంతోపాటు అవసరమైన టీకాలు తీసుకోవడం, ముందస్తు గుర్తింపు కోసం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
2020లో ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రచురించిన నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రకారం, పురుషులలో అత్యంత సాధారణ క్యాన్సర్లలో లివర్ క్యాన్సర్ ఐదవ స్థానంలో ఉంది. ఖతార్ క్యాన్సర్ సొసైటీలోని హెల్త్ ఎడ్యుకేటర్ నూర్ మక్కియా మాట్లాడుతూ.. క్యాన్సర్ గురించి సమాజంలో అవగాహనను పెంచే లక్ష్యంతో సొసైటీ పనిచేస్తుందని తెలిపారు. పలు భాషలలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్







