పంజాబ్ లో బోల్తో పడిన బస్సు ..10 మంది దుర్మరణం
- July 07, 2025
చండీగడ్: పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలో సోమవారం ఉదయం బస్సు మార్గమధ్యలో బోల్తా పడింది,ఈ ప్రమాదంలో 10 మంది మరణించగా, కనీసం 32 మంది గాయపడ్డారు. దసుయా ప్రాంతంలోని దసుయా-హాజీపూర్ రోడ్డులోని సాగ్రా అడ్డా సమీపంలో ఈ సంఘటన జరిగింది. బస్సు నియంత్రణ కోల్పోవడంతోనే బోల్తా పడిందని పోలీసులు చెప్పారు.. గాయపడిన వారిని చికిత్స కోసం దసుహాలోని సివిల్ ఆసుపత్రిలో చేర్చారు.
బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సహాయం కోసం కేకలు విన్న స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. పోలీసులను అప్రమత్తం చేసి, అంబులెన్స్‌లను వెంటనే రప్పించారు. పోలీసు బృందాలు, స్థానికుల సహాయంతో, గాయపడిన వారిని బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదానికి గురైన వాహనం కర్తార్ బస్ అనే ప్రైవేట్ సంస్థ నడుపుతున్న మినీ బస్సు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా అస్పష్టంగా ఉన్నప్పటికీ, డ్రైవర్ లోపం, యాంత్రిక వైఫల్యం , ఇతర రహదారి సంబంధిత సమస్యల వల్ల జరిగిందా అని తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్‌స్టాప్‌లలో రియల్‌టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్‌లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్‌లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







