కొత్త నైపుణ్య-ఆధారిత వ్యవస్థను ఆవిష్కరించిన సౌదీ అరేబియా..!!
- July 07, 2025
రియాద్: సౌదీ అరేబియా ప్రవాస కార్మికుల కోసం కొత్త నైపుణ్య ఆధారిత వ్యవస్థను ఆవిష్కరించింది. ఈ మేరకు విదేశీ కార్మికుల పని అనుమతులను మూడు ప్రధాన నైపుణ్య వర్గాలుగా వర్గీకరిస్తూ సౌదీ మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రి అహ్మద్ అల్-రాజి ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం సౌదీ కార్మిక మార్కెట్లో పనిచేస్తున్న విదేశీయుల కోసం ఇప్పటికే ఉన్న వర్క్ పర్మిట్లు, సాంకేతిక వ్యవస్థ అప్‌గ్రేడ్‌ల వర్గీకరణ జూన్ 18న ప్రారంభమైంది. ఈ వర్గీకరణ జూలై 1 నుండి ఇన్‌కమింగ్ విదేశీ కార్మికులకు అమలులోకి వస్తుంది. మంత్రిత్వ శాఖ ఒక మార్గదర్శక మాన్యువల్‌ను విడుదల చేసింది. దాని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
కార్మికుల పనితీరును మెరుగుపరచడం, సౌదీ కార్మిక మార్కెట్‌కు నైపుణ్యం, పని అనుభవాన్ని.. ప్రపంచ ప్రతిభను ఆకర్షించడం, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, వ్యాపారాల అభివృద్ధికి మద్దతు ఇచ్చే వాతావరణాన్ని కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందని అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తమ అంతర్జాతీయ పద్ధతులకు అనుగుణంగా కార్మికులు వారి ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు, అర్హతలను కలిగి ఉన్నారని నిర్ధారించడం ద్వారా కార్మిక మార్కెట్లో ప్రవాస కార్మికుల నైపుణ్య-స్థాయి పంపిణీని బాగా నిర్వహించడానికి వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!