సోహార్ ప్రయోగశాలలో సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ లీక్..!!

- July 07, 2025 , by Maagulf
సోహార్ ప్రయోగశాలలో సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ లీక్..!!

మస్కట్: ఉత్తర అల్ బటినాలోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్‌మెంట్ (CDAA) స్పెషల్ టీమ్స్.. సోహార్‌లోని విలాయత్‌లోని ఒక కంపెనీకి చెందిన ప్రయోగశాలలో సల్ఫర్ డయాక్సైడ్ (SO₂) గ్యాస్ లీక్‌ను విజయవంతంగా నియంత్రించింది. అధికారుల ప్రకారం.. ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకుండా వేగంగా ఆపరేషన్ ను పూర్తిచేశారు. అత్యవసర ప్రతిస్పందన బృందం ఆ ప్రాంతాన్ని సురక్షితంగా చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తుంది. 

సల్ఫర్ డయాక్సైడ్ అనేది మానవ ఆరోగ్యం, పర్యావరణంపై తీవ్రమైన దుష్ఫ్రభావాలను కలిగిస్తుంది.  వేగంగా విస్తరించి మనుషులతోపాటు జంతుజాలానికి తీవ్ర నష్టం చేస్తుందని నిపుణులు హెచ్చరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com