సౌదీలో విదేశీయుల కోసం కొత్త ప్రాపర్టీ ఓనర్షిప్ చట్టం..!!
- July 09, 2025
జెడ్డా: సౌదీయేతరుల ఆస్తి యాజమాన్యాన్ని నియంత్రించే కొత్త చట్టాన్ని క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షతన జరిగిన సౌదీ అరేబియా క్యాబినెట్ ఆమోదించింది. జెడ్డాలో జరిగిన ఈ సమావేశం సందర్భంగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో ఇటీవల జరిగిన చర్చలు , జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ నుండి తనకు వచ్చిన ఫోన్ కాల్ గురించి క్రౌన్ ప్రిన్స్ క్యాబినెట్‌కు వివరించారు.
సౌదీ-ఇండోనేషియా సుప్రీం కోఆర్డినేషన్ కౌన్సిల్ మొదటి సమావేశాన్ని క్యాబినెట్ ప్రశంసించింది. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయని హైలైట్ చేసింది. ఈ ఒప్పందాలు క్లీన్ ఎనర్జీ, పెట్రోకెమికల్స్, ఏవియేషన్ ఇంధన సేవలు, తదితర రంగాలను కవర్ చేస్తాయని మంత్రి డాక్టర్ ఎస్సామ్ బిన్ సయీద్ తెలిపారు. పెట్రోలియం మార్కెట్ బ్యాలెన్స్ ను కాపేడేందుకు మద్దతు ఇవ్వడానికి OPEC+ కూటమిలోని చమురు ఉత్పత్తిదారులతో నిరంతర సమన్వయం చేసుకుంటున్నట్ల పేర్కొన్నారు.
ఈ నవంబర్‌లో రియాద్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (UNIDO) 21వ జనరల్ కాన్ఫరెన్స్‌ను సౌదీ అరేబియా నిర్వహించడాన్ని మంత్రివర్గం స్వాగతించింది. అలాగే, డిజిటల్ ప్లేసేలలో పిల్లలను రక్షించడానికి సౌదీ నేతృత్వంలోని తీర్మానాన్ని UN మానవ హక్కుల మండలి ఏకగ్రీవంగా ఆమోదించడాన్ని మంత్రివర్గం ప్రశంసించింది. ఈ చొరవ క్రౌన్ ప్రిన్స్ ప్రారంభించిన ప్రపంచ "చైల్డ్ ఆన్‌లైన్ సేఫ్టీ" నుంచి వచ్చిందన్నారు. 2025 ఎడిషన్ ఆఫ్ వరల్డ్ కాంపిటీటివ్‌నెస్ ఇయర్‌బుక్ ప్రకారం.. సౌదీ అరేబియా ప్రపంచ సైబర్ భద్రతలో అగ్రస్థానంలో కొనసాగుతుండటం పట్ల మంత్రివర్గం హర్షం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్