హైదరాబాద్: క‌ల్తీ క‌ల్లు కాటుకి మూడుకి చేరిన మరణాలు…

- July 09, 2025 , by Maagulf
హైదరాబాద్: క‌ల్తీ క‌ల్లు కాటుకి మూడుకి చేరిన మరణాలు…

హైదరాబాద్: కూక‌ట్‌ప‌ల్లి ప‌రిధి హైద‌ర్‌న‌గ‌ర్ లో క‌ల్తీ క‌ల్లు తాగి ముగ్గురు మృతి చెంద‌గా, మ‌రో 13 మంది అస్వ‌స్థ‌త‌కు గురైన‌ సంగ‌తి విదిత‌మే.అయితే క‌ల్తీ క‌ల్లు తాగి అస్వ‌స్థ‌త‌కు గురై గాంధీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న 16 మంది ఆరోగ్య ప‌రిస్థితిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ ఆరా తీశారు. వారి మెరుగైన వైద్య సేవ‌లు అందించాల‌ని గాంధీ ఆస్ప‌త్రి డాక్ట‌ర్ల‌కు ఆదేశించారు. అలాగే కొంద‌రు నిమ్స్‌లో చేరారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న‌ వారికి మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్ డైరెక్టర్ బీరమ్మను ఆదేశించారు. అస్వ‌స్థ‌త‌కు గురైన వారిలో ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

కూక‌ట్‌ప‌ల్లి ప‌రిధి హైద‌ర్‌న‌గ‌ర్ క‌ల్లు డిపో లోని మంగ‌ళ‌వారం క‌ల్లు తాగిన 16 మంది వాంతులు, విరేచ‌నాలు ప‌ట్టుకున్నాయి. దీంతో అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమించడంతో చనిపోయారు. మరో పదమూడు మంది చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఒకరు ఇంట్లోనే మరణించగా మరో ఇద్దరు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు తులసిరామ్‌ (47), బొజ్జయ్య (55), నారాయణమ్మ (65)గా గుర్తించారు. చనిపోయినవారంతా హెచ్‌ఎంటీ హిల్స్‌ సాయిచరణ్‌కాలనీకి చెందినవారుగా సమాచారం.

కాంగ్రెస్ నేత క‌ల్లు డిపో
కూక‌ట్‌ప‌ల్లి ప‌రిధి హైద‌ర్‌న‌గ‌ర్‌లోని క‌ల్తీ క‌ల్లు ఘ‌ట‌న జ‌రిగిన క‌ల్లు కాంపౌండ్ కాంగ్రెస్ నాయ‌కుడిదే అని కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు ఆరోపించారు. శేరిలింగంప‌ల్లి కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు దీనిని న‌డుపుతున్నార‌ని చెబుతున్నారు. ప్ర‌జ‌ల ప్రాణాల‌తో ఆడుకుంటే ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com