కార్మిక శాఖ మంత్రి డా.వివేక్ వెంకటస్వామిని కలిసిన జర్మన్ డెలిగెట్స్

- July 09, 2025 , by Maagulf
కార్మిక శాఖ మంత్రి డా.వివేక్ వెంకటస్వామిని కలిసిన జర్మన్ డెలిగెట్స్

హైదరాబాద్: జర్మనీ ప్రభుత్వ ప్రతినిధుల బృందం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు ఫ్యాక్టరీల శాఖ మంత్రి డా.వివేక్ వెంకటస్వామిని రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలసింది.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు టామ్‌కామ్ వైస్ చైర్మన్ ఎం.దాన కిషోర్ఐ పాల్గొన్నారు.

బృందంలో మిసెస్ బియాంకా మారియా కుంజ్, మిసెస్ డెజెనా హర్టిక్,అబ్దుల్ రెహ్‌మాన్ ఆల్తాహ్లెహ్, GIZ ఇండియా ప్రతినిధులు ఉన్నారు.ట్రిపుల్ విన్ ప్రాజెక్ట్ (TWP) కింద తెలంగాణ నర్సులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో ఉచిత జర్మన్ భాషా శిక్షణతోపాటు, ఆ తరువాత వారు జర్మనీలోని ప్రఖ్యాత ఆరోగ్య సంస్థల్లో నియమితులవుతారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు, నర్సింగ్ రంగానికి పటిష్టంగా తోడ్పాటు ఇవ్వడంతోపాటు, ఇతర రంగాల్లోనూ—ముఖ్యంగా ITI విద్యార్థులకు—Ausbildung ప్రోగ్రాం ద్వారా అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.అంతర్జాతీయ సహకారాలతో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ నెల 9వ తేదీ నుండి 17వ తేదీ వరకు బేగంపేట పర్యాటక భవన్‌లో తెలంగాణ నర్సులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది ఎంపికైన TWP బ్యాచ్ నర్సులు ఇప్పటికే B1 స్థాయి జర్మన్ భాష శిక్షణ పూర్తి చేసి అక్టోబర్–నవంబర్ 2025లో జర్మనీలో చేరనున్నారు.

టామ్‌కామ్ సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్ర యువతకు విదేశీ ఉద్యోగ అవకాశాలను సమకూర్చడంలో ప్రభుత్వం పటిష్టంగా ముందడుగు వేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com