దుబాయ్‌లో ఘనంగా జరిగిన వైఎస్సార్ జయంతి

- July 09, 2025 , by Maagulf
దుబాయ్‌లో ఘనంగా జరిగిన వైఎస్సార్ జయంతి

దుబాయ్: ఆపదలో ఆదుకునే అన్నగా ప్రజల హృదయాల్లో చిరస్మరణీయులైన డా.వై.ఎస్. రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని దుబాయ్‌లోని కరామా పార్క్‌లో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమాన్నిYSRCP UAE బృందం ఆధ్వర్యంలో నిర్వహించింది.రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ఈ సేవా కార్యక్రమాన్ని షేక్ అబ్దుల్లా, ప్రేమ్, యాడ్ర శ్రీనివాసు  సమన్వయపరిచారు.

ఈ సందర్భంగా డా.వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఘనంగా జరిపారు.ఈ సందర్భంగా స్థానిక కార్మికుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో వందలాది మంది పాల్గొని వైఎస్సార్ సేవా స్ఫూర్తిని గౌరవంగా స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యూఏఈ సభ్యులు సయ్యద్ అక్రమ్ మాట్లాడుతూ డా. వైఎస్సార్ తెలుగు ప్రజల మనసుల్లో నిలిచిపోయిన యుగ పురుషుడు అని ఆయన సంక్షేమ పాలన పథకాల ప్రభావం నేటికీ అనేక కుటుంబాల్లో కనిపిస్తోంది. ఆయన ఆశయాల్ని మన ప్రియతమ నేత జగన్ మోహన్ రెడ్డి ద్వారా ముందుకు తీసుకు వెళ్ళటమే  మన బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు.

మరొక సభ్యుడి చక్రి మాట్లాడుతూ చనిపోయిన తర్వాత జీవించే అదృష్టం చాలా తక్కువ మందికి దొరుకుతుందని అటువంటి వారిలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మన ముందు తిరిగిన ఒకరు అని,కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి ప్రగతికి కృషి చేసిన మహనీయుడి స్మరించుకుంటూ చేస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనటం సంతోషాన్ని కలిగించిందని, వైద్య సేవలు, విద్య, సంక్షేమం కోసం ఆయన కలలుగన్న సమాజాన్ని అందరితో కలసి నిర్మించాలన్నదే జగన మోహన్ రెడ్డి ఆశయం అని ఆయన సైనికులుగా మనం అంతా శక్తికి మించి కృషి చేయాలి అని విజ్ఞప్తి చేశారు.

2008లో వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా లబ్ధి పొంది యూఏఈ లో స్తిర పడిన సమీర్ తన జీవితం ఎలా మారిందో వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. 

ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా హాజరైన డా.ఖాజా అబ్దుల్ ముత్తలిబ్, గౌరవ అతిథులుగా Spread Kindness సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నజీర్ ఉద్దీన్ మహమ్మద్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినవారిలో షేక్ అబ్దుల్లా, సయ్యద్ అక్రమ్ భాష, చక్రి, ప్రేమ్,యాడ్ర శ్రీను, పిరావు, అబ్దుల్ ఫహీమ్, షోయబ్, అబ్దుల్ రఫీక్, షామ్, ఘానీ, సిరాజ్, షేక్ సమీర్, రవి, పిల్లి రవి, కె.ప్రసాద్, జో బాబు, కిషోర్, బాబ్జీ, ప్రభాకర్,చిట్టి బాబు, నరేశ్, శాంతి, రాణి, ప్రభావతి, చిన్ని, విజయ, మేరీ, రాజేశ్వరి, సునీత, వనిత, కమల,భారతీ తదితరులు ఉన్నారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com