దుబాయ్ లో డెలివరీ బైక్ రైడర్లకు ఆర్టీఏ గుడ్ న్యూస్..!!
- July 09, 2025
దుబాయ్: డెలివరీ బైక్ రైడర్లకు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) కొత్తగా కొన్ని ప్రత్యేక సౌకర్యాలను కల్పించింది. బస్, మెట్రో స్టేషన్లలో డెలివరీ బైక్ రైడర్ల కోసం 15 కొత్త ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి ప్రాంతాలను ఏర్పాటు చేసింది. రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి, రైడర్ల జీవన నాణ్యతను పెంచడానికి , అదే విధంగా మిడ్ డే వర్క బ్యాన్ సమయంలో అవసరమైన వారికి సేవలతోపాటు సౌకర్యాలను అందించడానికి కృషి చేస్తున్నట్లు ఆర్టీఏ తెలిపింది. ప్రతిరోజూ మధ్యాహ్నం 12:30 నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో ఎండలో పనిచేయడంపై నిషేధం ఉంది. సెప్టెంబర్ 15 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది.
గతంలో ఎమిరేట్‌లోని కీలక ప్రదేశాలలో 40 శాశ్వత సౌకర్యాలను రైడర్ల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. షెల్టర్‌లలో వాటర్ డిస్పెన్సర్‌లు, మొబైల్ ఫోన్ ఛార్జింగ్ సౌకర్యం, మోటార్‌బైక్‌ల కోసం తగినంత పార్కింగ్ వంటి వివిధ సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
అలాగే, డెలివరూతో భాగస్వామ్యంతో యూఏఈ ఫుడ్ బ్యాంక్ సౌజన్యంతో కొత్తగా స్థాపించబడిన తాత్కాలిక విశ్రాంతి ప్రాంతాలలో 7,500 రెడీమేడ్ హాట్ మీల్స్ సరఫరా చేస్తున్నారు.
కొత్తగా విశ్రాంతి ప్రాంతాలు ఏర్పాటు చేసిన బస్ స్టేషన్ల వివరాలు: గోల్డ్ సౌక్, అల్ సత్వా, అల్ జాఫిలియా, ఔద్ మేథా.
మెట్రో స్టేషన్ ల వివరాలు : ఈ& (ఎగ్జిట్ 1), అల్ కుసైస్ (ఎగ్జిట్ 1 , 2), ఎమిరేట్స్ టవర్స్ (ఎగ్జిట్ 1), ఇన్సూరెన్స్ మార్కెట్ (ఎగ్జిట్ 2), సెంటర్ పాయింట్ (ఎగ్జిట్ 1), అల్ ఫుర్జన్ (ఎగ్జిట్ 1), బిజినెస్ బే (ఎగ్జిట్ 2), DMCC (ఎగ్జిట్ 2), ADCB (ఎగ్జిట్ 2), బుర్జుమాన్ (ఎగ్జిట్ 4).
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!