లైఫ్ టైమ్ గోల్డెన్ వీసా ఇష్యూ.. క్షమాపణలు తెలిపిన యూఏఈ గ్రూప్..!!
- July 10, 2025
యూఏఈ: "జీవితకాల యూఏఈ గోల్డెన్ వీసా" వివాదం నేపథ్యంలో దుబాయ్‌కు చెందిన ఒక గ్రూప్ క్షమాపణలు తెలిపింది. అంతకుముందు నామినేషన్ పద్ధతిలో Dh100,000 రుసుము చెల్లిస్తే లైఫ్ టైమ్ గోల్డెన్ వీసా అంటూ ప్రకటనలు జారీ చేయడంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) "లైఫ్‌టైమ్ వీసా" అనే వాదనను తోసిపుచ్చింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. అనంతరం రాయద్ గ్రూప్ క్షమాపణలు చెబుతూ ప్రకటన విడుదల చేసింది. అన్ని వీసా నిర్ణయాలు సంబంధిత యూఏఈ ప్రభుత్వ అధికారుల అధికార పరిధిలోనే ఉంటాయని అందులో స్పష్టంచేసింది. దరఖాస్తుదారులకు అవసరమైన సలహా మద్దతును అందించడం, ఇప్పటికే ఉన్న చట్టపరమైన మార్గాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వారికి గైడ్ చేయడం మాత్రమే తమ విధి అని పేర్కొంది.
యూఏఈ వీసాలకు సంబంధించి మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లడం ద్వారా లేదా కాల్ సెంటర్ (600522222) కు కాల్ చేయడం ద్వారా తెలుసుకోవాలని, ఎల్లప్పుడూ అధికారికంగా వచ్చిన సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ICP ప్రజలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!







