అబుదాబిలో కారు బోల్తా..భయంకరమైన ప్రమాదం..!!

- July 12, 2025 , by Maagulf
అబుదాబిలో కారు బోల్తా..భయంకరమైన ప్రమాదం..!!

యూఏఈః ప్రమాదం జరగడానికి ఒక క్షణం చాలు. డ్రైవర్ నిర్లక్ష్యం కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం అవుతోంది. యూఏఈలోని పోలీసులు .. పరధ్యానంలో డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాలు,  దాని వల్ల కలిగే ప్రమాదకర పరిణామాల గురించి పదేపదే హెచ్చరిస్తున్నారు.  ‘ప్రమాదాలు లేని వేసవి’ ప్రచారంలో భాగంగా.. అబుదాబి పోలీసులు పరధ్యానంలో డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే రెండు వేర్వేరు ప్రమాదాలకు సంబంధించిన వీడియే క్లిప్ లను విడుదల చేశారు.  
మొదటి సంఘటనలో ఒక తెల్లటి SUV ఫాస్ట్ లేన్లో వెళుతుంది. అయితే, డ్రైవర్ ముందు నిలబడి ఉన్న వాహనాల పొడవైన వరుసను గమనించక ముందుకు పోనియ్యడంతో ముందున్న SUVని ఢీకొట్టాడు.
రెండవ ప్రమాదం మరింత భయంకరమైనది. వేగంగా వస్తున్న నల్లటి SUV మొదటి రెండు లేన్లలో ఆగిపోయిన వాహనాలను గమనించలేదు. డ్రైవర్ ఢీకొనకుండా ఉండటానికి ఫాస్ట్ లేన్ నుండి రెండవ లేన్లోకి వెళ్లి, మొదటి లేన్లో ఒక కారును ఢీకొని, రెండవ లేన్లో మరొక SUVని ఢీకొట్టాడు. ఢీకొన్న వాహనం బోల్తా పడింది.  
అబుదాబి పోలీసులు డ్రైవింగ్ చేసే సమయంలో డ్రైవర్లు ఇంటర్నెట్, సోషల్ మీడియా బ్రౌజ్ చేయడానికి, కాల్స్ చేయడానికి, ఫోటోలు తీయడానికి,  తీవ్రమైన ట్రాఫిక్ ప్రమాదాలకు దారితీసే మొబైల్ ఫోన్లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరించారు. ఉల్లంఘించిన వారికి దిర్హం 800 జరిమానా, వారి డ్రైవింగ్ రికార్డుపై నాలుగు బ్లాక్ పాయింట్లు విధించబడతాయని అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com