హేబా పటేల్ మరో మెగా హీరోతో..
- July 14, 2016
కుమారి 21ఎఫ్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల దృష్టిని కూడా ఆకర్షించిన హీరోయిన్ హేబా పటేల్. అందంతో పాటు తన బోల్డ్ యాక్టింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటి. ఆ ఇమేజే ఇప్పుడు ఈ అమ్మడికి వరుస అవకాశాలను తెచ్చిపెడుతుంది. స్టార్ హీరోయిన్లు కాదన్న ఛాన్స్ లు కూడా హేబా తలుపు తడుతున్నాయి. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కాదన్న ఓ క్రేజీ ఆఫర్ ను కొట్టేసింది హేబా.ఇప్పటికే మెగా హీరో వరుణ్ తేజ్ సరసన మిస్టర్ సినిమాలోనటిస్తుంది హేబా. ఈ సినిమా ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లింది. ఈ సినిమా లైన్ లో ఉండగానే మరో మెగా హీరో నుంచి పిలుపు వచ్చింది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు రకుల్ ప్రీత్ ను హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. అయితే మహేష్ బాబు సినిమా కోసం ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది రకుల్. దీంతో ఈ సినిమాలో హేబా పటేల్ హీరోయిన్ గా తీసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







