సిబ్బందితో బహిరంగ పనిని సాయంత్రం వేళ చేయించేందుకు సంస్థల ఆసక్తి
- July 14, 2016
వేసవిలో భారంగా వాతావరణ పరిస్థితులు కతర్ లో కొనసాగుతున్నాయి. నిర్మాణ సంస్థల అనేకం తమ తమ సిబ్బందితో రోజు వేకువజామున లేదా సాయంత్రం వేళ బహిరంగ పని చేయించేందుకు అలవాటుపడటం జరుగుతుంది.
ఈ సంస్థలు పాక్షికంగా లేదా పూర్తిగా సాయంత్రం లేదా ఉదయాన్నే కార్మికులతో బహిరంగ పనులను చేయించేందుకు చర్యలను తీసుకొంటున్నట్లు " మా గల్ఫ్ డాట్ కామ్ " పరిశీలనలో సైతం తేలింది. ఇందులో కొన్ని సంస్థలకు ఈ దోహా లో మరియు శివార్లలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులలో వీటిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకోవడంతో,పని వేళలో మార్పు కార్మికులకు ఎంతో ఉపశమనం కల్గిస్తుంది. వేసవి కారణంగా మారిన పరిస్థితులు కారణంగా ఆలస్యంగా సాయంత్రం వేళలలో పనులు ప్రారంభించడంతో నిర్మాణ విధుల విషయంలో కార్మికులు తమ పనులను ఎంతో సులభతరంగా నిర్వహిస్తున్నారు. వారు పని గంటలను మరింతగా భరించదగినట్లుగా ఉన్నారు తద్వారా మృదువైన మరియు సమర్థవంతమైన ఉత్పాదకతని సాధించే దిశలో నిర్ధారిస్తుంచడం గమనించవచ్చు.. మధ్యాహ్నం పూత పని నిషేధం విధానం తీవ్రమైన వేసవి నెలల్లో ప్రతి సంవత్సరం కతర్ అమలవుతుంది. మంత్రివర్గ నిర్దేశకం ప్రకారము ఎటువంటి బహిరంగ పనులను కార్మికులతో చేయించరాదని జూన్ నెల మధ్య నుండి ఆగస్టు చివరి వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో ఉదయం 11.30 గంటల నుండి మరియు సాయంత్రం మూడు గంటల కాలంలో పనికి అనుమతి నిషేధించారు. కార్మికుల పరిస్థితి మరింత సులభం చేసేందుకు, కొన్ని కంపెనీలు సాయంత్రం 7 గంటల నుంచి లేదా తెల్లవారుజామున 2 గంటలు 2.30 గంటల తర్వాత పని ప్రారంభించడానికి మార్పులకు తెర తీశారు. పగటి పూట కూడా పని చేస్తున్నప్పుడు, కార్మికులు ఇప్పటికీ కొంత ఉపశమనం పొందినప్పటకీ మధ్యాహ్నం తర్వాత మూడు గంటలకు పని మొదలు పెట్టినపుడు ఉష్ణోగ్రత ఉదయం పూట పని గంటల కంటే సాధారణంగా వేడి అధికంగానే ఉంటుందని కార్మికులు వాపోతున్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







