వింబుల్డన్ విజేతగా యానిక్ సినర్..
- July 14, 2025
ప్రతిష్టాత్మక వింబుల్డన్ 2025 గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ విజేతగా ప్రపంచ నెంబర్ వన్, ఇటలీ స్టార్ జానిక్ సినెర్ నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో 4-6, 6-4, 6-4, 6-4 తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాస్ పై గెలుపొందాడు.ఈ విజయంతో గత నెలలో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతికారం తీర్చుకున్నాడు. కాగా.. ఫైనల్ మ్యాచ్‌లో ఓటమితో హ్యాట్రిక్ వింబుల్డన్ టైటిల్స్‌ను గెలవాలనే అల్కరాజ్ కల చెదిరిపోయింది.
ఈ మ్యాచ్ దాదాపు మూడు గంటల 4 నిమిషాల పాటు సాగింది. తొలి సెట్ ఆరంభంలో సినర్ దూకుడుగా ఆడాడు. అయితే.. గ్రేమ్‌లో అతడికి బ్రేక్ లభించడంతో 4-2తో సెట్ దిశగా సాగాడు. అయితే.. అద్భుతంగా పుంజుకున్న అల్కరాజ్ బలమైన బేస్‌లైన్ ఆటతో అదరగొట్టాడు. తొలి సెట్‌ను 6-4తో గెలుచుకున్నాడు.
అయితే.. తొలి సెట్లో ఓడిపోయినప్పటికి ఆ తరువాత సినర్ చాలా బలంగా పుంజుకున్నాడు. వరుసగా మూడు సెట్లను గెలుచుకుని ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించడంతో పాటు తొలి వింబుల్డన్ ట్రోఫీని గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ 15 ఏస్‌లు సంధించి 7 డబుల్ పాల్ట్స్ చేశాడు. మరోవైపు జానిక్ సిన్నర్ 8 ఏస్‌లు సంధించి.. 2 డబుల్ ఫాల్ట్స్ మాత్రమే నమోదు చేశాడు.
ఇక విజేతగా నిలిచిన సినర్‌కు రూ.34 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. రన్నరప్ అల్కరాజ్ రూ. 17.65 కోట్ల ప్రైజ్‌మనీ అందుకోనున్నాడు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







