ఏపీ స్పేస్ పాలసీని ప్రకటించిన ప్రభుత్వం..
- July 14, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఏపీ స్పేస్ పాలసీని ప్రకటించింది. 2025-30 వరకు ఐదేళ్ల పాటు అమల్లో ఉండేలా స్పేస్ పాలసీ మార్గదర్శకాలను వెల్లడించింది అంతరిక్ష రంగంలోఅభివృద్ది, స్పేస్ పాలసీ అమలుకు ఏపీ స్పేస్ సిటీ కార్పోరేషన్ ను ఏర్పాటు చేయాలని ఆదేశాల ఇచ్చింది.
కార్పొరేషన్ ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్టార్టప్ నిధులు, పెట్టుబడులను ఆకర్షించాలని నిర్దేశించింది. కార్పొరేషన్ ద్వారా స్పేస్ విభాగంలోని దేశీయ, అంతర్జీతీయ సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పరుచుకోవాలని చెప్పింది.
అంతరిక్ష ప్రాజెక్టులను అమలు చేయడానికి పెట్టుబడిదారులకు కార్పొరేషన్ సహాయం చేస్తుందని వెల్లడించింది. శ్రీ సత్యసాయి , తిరుపతి జిల్లాల్లో స్పేస్ సిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. స్పేస్ సిటీలో భూ కేటాయింపు, దరఖాస్తుల పరిశీలన, ప్రాసెస్ కోసం సాంకేతిక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్దేశించింది.
పరిశ్రమల కమిషనర్ ఆధ్వర్యంలో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయలని ఆదేశాల్లో ప్రభుత్వం తెలిపింది. అంకుర సంస్థలు, పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పింది. తగిన చర్యలు తీసుకోవాలని ఎపీఐఐసీ ఛైర్మన్, ఎండీని ఆదేశించింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







