కువైట్ విమానాశ్రయంలో పెరిగిన అత్యవసర వైద్య సంసిద్ధత..!!

- July 15, 2025 , by Maagulf
కువైట్ విమానాశ్రయంలో పెరిగిన అత్యవసర వైద్య సంసిద్ధత..!!

కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 20 ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ కార్డియాక్ డీఫిబ్రిలేటర్లను (AEDలు) కీలక టెర్మినల్స్‌లో ఏర్పాటు చేయడం ద్వారా అత్యవసర వైద్య సంసిద్ధతను పెంచినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. AED పరికరాలను టెర్మినల్స్ 1, 4 మరియు 5లో, అలాగే విమానాశ్రయ ఆరోగ్య కేంద్రంలో, ప్రజారోగ్య రంగం పర్యవేక్షణలో అందుబాటులో ఉంటాయని మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్-సనద్ తెలిపారు. ఈ మేరకు X ప్లాట్‌ఫారమ్‌లోని ఒక ప్రకటనను షేర్ చేశారు.  డీఫిబ్రిలేటర్లను సకాలంలో ఉపయోగించడం వల్ల బతికే రేటు 70% వరకు పెరుగుతుందని డాక్టర్ అల్-సనద్ పేర్కొన్నారు.  

గుండె లయ ప్రమాదకరంగా అసాధారణంగా మారినప్పుడు, ఆకస్మిక గుండెపోటుకు దారితీసే అవకాశం ఉన్నప్పుడు సాధారణ హృదయ స్పందనను పునరుద్ధరించడానికి కార్డియాక్ డీఫిబ్రిలేటర్ కీలకంగా మారుతుంది. AEDలు పోర్టబుల్ డీఫిబ్రిలేటర్లు, వీటిని వైద్య శిక్షణ లేనివారు కూడా సులభంగా ఉపయోగించుకోవచ్చు.  ఆకస్మిక గుండెపోటును ఎదుర్కొంటున్న వారికి ఇవి ఎంతగానో సహాయపడతాయని అన్నారు. పరికరాలను సమర్థవంతంగా ఆపరేట్ చేయడానికి విమానాశ్రయ సిబ్బందికి అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించామని తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com