విదేశీ విద్యా డిగ్రీల ధృవీకరణకు న్యూ రూల్స్..!!

- July 15, 2025 , by Maagulf
విదేశీ విద్యా డిగ్రీల ధృవీకరణకు న్యూ రూల్స్..!!

కువైట్: కువైట్ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ.. క్వాడ్రాబే వెరిఫికేషన్ సర్వీసెస్‌తో కలిసి కొత్త విద్యా డిగ్రీల ధృవీకరణ సేవను ప్రారంభించింది. విదేశాలలో పొందిన అర్హతల ప్రామాణికతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది.  గుర్తింపు పొందిన సంస్థ ధృవీకరించకపోతే, దాని నిబంధనలకు అనుగుణంగా లేకపోతే వాటిని అంగీకరించబోమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఇక, దరఖాస్తుదారులు అధికారిక ఎలక్ట్రానిక్ పోర్టల్‌ను మాత్రమే ఉపయోగించి దరఖాస్తు చేయాలని సూచించారు. దాంతోపాటు, స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లోకి అంగీకరించబడిన విద్యార్థులు 60 రోజుల్లోపు సహల్ యాప్ ద్వారా వారి సంరక్షకుడితో ధృవీకరించాల్సి ఉంటుంది. అలాగే పరీక్ష ఫలితాలను అప్‌లోడ్ చేయాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com