ట్రేడింగ్‌లో అధిక లాభాలంటూ..రూ.57.43 లక్షలు కొల్లగొట్టేశారు
- July 16, 2025
హైదరాబాద్: ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఆర్జించవచ్చని ఓ వృద్ధురాలిని నమ్మించి రూ.57.43లక్షలను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు.మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.డీసీపీ ధార కవిత తెలిపిన వివరాలిలా ఉన్నాయి.జూబ్లీహిల్స్ కు చెందిన 60 ఏళ్ల వృద్ధురాలికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎఫ్ఎక్స్ రోడ్ పేరుతో ఆన్లైన్ ట్రేడింగ్ ప్రకటన కనిపించింది.
అదేంటో చూద్దామని ఆమె ఆ ప్రకటనలోని లింక్‌ను క్లిక్ చేసింది. అంతే..గుర్తుతెలియని వ్యక్తులు వెంటనే లైన్లోకి వచ్చారు. తమ వెబ్సైట్లో ఆన్లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలుంటాయని నమ్మించారు. ముడిచమురు సంస్థలు, లోహాలు, క్రిప్టోకరెన్సీ(Cryptocurrency), టెస్లా వంటి పెద్ద పెద్ద కంపెనీల ట్రేడింగ్ జరుగుతుందని, ఊహించని స్థాయిలో లాభాలు వస్తాయని నమ్మించారు.వారి మాటలను విశ్వసించిన ఆమెతో బ్యాంకుల నుంచి, క్రెడిట్ కార్డు నుంచి రకరకాలుగా పెట్టుబడులు పెట్టించారు.
ప్రారంభంలో మంచి లాభాలు రావడంతో ఆమెకు పూర్తిగా నమ్మకం కుదిరింది. ఆ తర్వాత ఆమెతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిస్తూ విడతల వారీగా రూ.57.43లక్షల వరకు పెట్టించారు. ఆ తర్వాత లాభాలు గానీ, విత్‌డ్రా గానీ చేసుకునే అవకాశం కల్పించలేదు. ఇదేంటని ప్రశ్నిస్తే మరింత పెట్టుబడులు పెట్టాలని, లేదంటే ఆ డబ్బులు తిరిగి రావని హెచ్చరించారు. మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







