తిరుమల: శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ

- July 16, 2025 , by Maagulf
తిరుమల: శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం సాయంత్రం సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా పుష్పపల్లకీ సేవ వైభవంగా జరిగింది.

వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకీపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఆల‌య డిప్యూటీ ఈవో లోకనాథం,పేష్కార్ రామకృష్ణ, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com