తిరుమలలో పాత భవనాల రూపురేఖలు మార్చాలి: టీటీడీ ఈవో
- July 18, 2025
తిరుమల: తిరుమలలోని పాత భవనాలను భక్తుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది ఉపయోగంలోకి తీసుకురావాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలో నిరుపయోగంగా ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ భవనాన్ని శుక్రవారం ఉదయం అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా భవన పరిస్థితిపై ఆరా తీస్తూ మరమ్మతులు చేయడం లేదా ఆ ప్రాంతంలో కొత్త భవనాన్ని నిర్మించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు.
అంతకుముందు హెచ్ వీడీసీ, బాలాజీ నిలయం, తిరుమల మందిరం(ఆంప్రో రెస్ట్ హౌస్) విశ్రాంతి భవనాలను పరిశీలించి పరిస్థితిని బట్టి మరమ్మతులు, పునర్నిర్మాణం పై కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ పరిశీలనలో టీటీడీ సీఈ సత్య నారాయణ, ఈఈ వేణు గోపాల్, డిప్యూటీ ఈవో భాస్కర్, పంచాయతీ & రెవెన్యూ డిప్యూటీ ఈవో వేంకటేశ్వర్లు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!