అమెరికా ఉపాధ్యక్షుడితో HRH క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ సమావేశం..!!
- July 18, 2025
మనామా: క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా వైట్ హౌస్‌లో యునైటెడ్ స్టేట్స్ ఉపాధ్యక్షుడు J. D. వాన్స్‌తో సమావేశమయ్యారు. 130 సంవత్సరాలకు పైగా ఉన్న బహ్రెయిన్-యుఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించడంలో బహ్రెయిన్ నిబద్ధతతో ముందుకువెళుతుందని హిజ్ రాయల్ హైనెస్ చెప్పారు. ఇటీవల బహ్రెయిన్ - యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కుదిరిన సమగ్ర భద్రతా ఏకీకరణ, సమృద్ధి ఒప్పందం (C-SIPA) కీలక ముందడుగుగా పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు.
టెక్నాలజ, పరిశ్రమలకు ప్రాంతీయ కేంద్రంగా బహ్రెయిన్ రాజ్యం తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనే నిబద్ధతను క్రౌన్ ప్రిన్స్ వ్యక్తం చేశారు. అధునాతన మౌలిక సదుపాయాలు దీనికి మద్దతు ఇస్తాయని పేర్కొన్నారు. ఈ పర్యటన సందర్భంగా ప్రకటించిన USD 17 బిలియన్ల పెట్టుబడి ప్యాకేజీ పలురంగాలను విస్తరించి ఉందని తెలిపార. అదే సమయంలో బహ్రెయిన్-యునైటెడ్ స్టేట్స్ మధ్య లోతైన విశ్వాసం, బలమైన సంబంధాలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ముఖ్యంగా ఇటీవలి ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని నిలబెట్టడానికి కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఇరుదేశాల నుంచి ముఖ్యమైన ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







