‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చే గెస్టులు వీళ్ళే..
- July 19, 2025
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా జులై 24న రిలీజ్ కాబోతుంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 21న హైదరాబాద్ శిల్పకళావేదికలో జరగనుంది.ఈ ఈవెంట్లో పవన్ స్పీచ్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు.అయితే హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టులు ఎవరు వస్తారో అని పెద్ద చర్చే నడుస్తుంది.
గతంలో రాజమౌళి, చిరంజీవి అని పేర్లు వినిపించాయి.నేడు నిర్మాత ఏఎం రత్నం మీడియాతో మాట్లాడుతూ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎవరెవరు గెస్టులుగా వస్తారో తెలిపారు.
నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ.. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ కచ్చితంగా వస్తారు. ప్రస్తుతానికి ఈ ఈవెంట్ కి రెండు తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులు కందుల దుర్గేష్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతో పాటు కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖన్ద్రే గెస్టులుగా రానున్నారు.ఆయన్ని పవన్ పిలవమన్నారు. అందుకే నేనే స్వయంగా వెళ్లి పిలిచాను.చిరంజీవి రావట్లేదు. ఫ్యామిలీ వద్దన్నారు పవన్ కళ్యాణ్. రాజమౌళి రావొచ్చు.నేను ఆయనతో మాట్లాడాలి. త్రివిక్రమ్ వస్తారు అని అన్నారు.
దీంతో ఈసారి కాస్త పొలిటికల్ గా కూడా ఈవెంట్ సాగుతుందని తెలుస్తుంది. ఇటీవల కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఏపీకి కొంకి ఏనుగుల విషయంలో సపోర్ట్ చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ ని బాగా పొగిడారు.అలాగే పార్టీలు వేరైనా ఒక మంచి విషయం కోసం కలిసి పనిచేసే ఆయన తత్వం పవన్ కళ్యాణ్ కి నచ్చింది. అందుకే ఆయన్ని పిలవమన్నట్టు తెలుస్తుంది.
తాజా వార్తలు
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్