కొత్త మొబైల్ యాప్‌ను ప్రారంభించిన HMC..!!
- July 21, 2025
దోహా: హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC) తన కొత్త మొబైల్ అప్లికేషన్ 'Lbaih'ను ప్రారంభించింది. ఇది రోగులకు వైద్య సేవలను సులభతరం చేయడంతోపాటు చికిత్స అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఖతార్ నేషనల్ విజన్ 2030ని సాధించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలకు ఇది మద్దతు ఇస్తుందన్నారు. వివిధ రకాల వైద్య సేవలను సులభంగా యాక్సెస్ చేయడానికి ఈ యాప్ రోగులకు వీలు కల్పిస్తుందని వివరించారు.
వైద్యసేవల అపాయింట్మెంట్లు, వైద్య రికార్డులను సులభంగా యాక్సెస్ చేయడం వంటి అనేక రకాల వైద్య సేవలను అందిస్తుంది. అలాగే, అపాయింట్మెంట్ రిమైండర్లు, ముఖ్యమైన హెచ్చరికలను కూడా పొందవచ్చు. ఈ యాప్‌ను స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆరోగ్య సంరక్షణ అందించే విధానంలో గుణాత్మక మార్పును ఈ యాప్ సూచిస్తుందని HMC చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఖలీద్ మొహమ్మద్ అల్ జల్హామ్ అన్నారు. యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







