కోలీవుడ్ కి అల్లరి నరేష్.!
- July 15, 2016
యువతరం హీరోల్లో జెట్ స్పీడుతో సినిమాలు చేస్తున్న యంగ్ హీరో అల్లరి నరేష్. ఈ మధ్య కాస్త తడబడి స్లో అయ్యాడు కానీ లేదంటే ఈ అల్లరోడు ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తూ వచ్చాడు. ప్రస్తుతం సెల్పీరాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ టాల్ స్టార్ త్వరలో ఓ స్ట్రయిట్ తమిళ సినిమా చేయడానికి అంగకీరించాడు. ఇప్పటికే కురుంబు, పొరలి లాంటి తమిళ సినిమాల్లో నటించిన నరేష్ మరోసారి తమిళ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు.అల్లరి నరేష్ కీలక పాత్రలో తెరకెక్కిన శంభో శివ శంభో సినిమాకు దర్శకత్వం వహించిన తమిళ దర్శకుడు సముద్రఖని, ఈ అల్లరోడితో మరోసారి తమిళ సినిమా చేయించాలని డిసైడ్ అయ్యాడు. స్టార్ ఇమేజ్ కు దూరంగా నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం ఉన్న పాత్ర కావటంతో నరేష్ కూడా వెంటనే అంగకీరించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. నరేష్ హీరోగా తెరకెక్కిన సెల్పీరాజా ఈ శుక్రవారం రిలీజ్ కాగా మరో రెండు తెలుగు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. హర్రర్ కామెడీగా తెరకెక్కుతున్న మా ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం సినిమాలో నటిస్తున్నాడు నరేష్. ఈ సినిమా తరువాత ప్రముఖ నటుడు కృష్ణభగవాన్ కథా కథనాలు అందిస్తున్న మేడ మీద అబ్బాయి సినిమా పటాలెక్కనుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







