ఒమన్‌లో లాజిస్టిక్స్ వృత్తులకు కొత్త లైసెన్స్..!!

- July 22, 2025 , by Maagulf
ఒమన్‌లో లాజిస్టిక్స్ వృత్తులకు కొత్త లైసెన్స్..!!

మస్కట్: ఒమన్ సుల్తానేట్ కార్మిక మంత్రిత్వ శాఖ (MoL) సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వచ్చేలా లాజిస్టిక్స్ రంగంలోని అనేక వృత్తులకు ప్రొఫెషనల్ ప్రాక్టీస్ లైసెన్స్ తప్పనిసరి అని ప్రకటించింది. కార్మిక మార్కెట్‌ను నియంత్రించడానికి, ఒమన్ సుల్తానేట్‌లో శ్రామిక శక్తి సామర్థ్యాన్ని పెంచడానికి, ఆమోదించబడిన వృత్తిపరమైన ప్రమాణాలకు అనుగుణంగా కొనసాగుతున్నాయని నిర్ధారించుకోవడానికి కార్మిక మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలలో ఇది ఒక భాగంమని అధికారులు వెల్లడించారు.  

ముఖ్యంగా, లాజిస్టిక్స్ రంగానికి సెక్టోరల్ స్కిల్స్ యూనిట్ నుండి ప్రొఫెషనల్ ప్రాక్టీస్ లైసెన్స్ పొందడం ఒమన్, ప్రవాస కార్మికులకు వర్క్ పర్మిట్ల జారీ లేదా పునరుద్ధరణకు తప్పనిసరి చేశారు. సెప్టెంబర్ 1నాటికి, ఈ ఆమోదించబడిన లైసెన్స్‌ను సమర్పించకుండా ఎటువంటి వర్క్ పర్మిట్ జారీ లేదా పునరుద్ధరణ కాదని స్పష్టం చేశారు. 

లాజిస్టిక్స్ సెక్టార్ కోసం సెక్టోరల్ స్కిల్స్ యూనిట్ అధికారిక ప్లాట్‌ఫామ్ ద్వారా లైసెన్స్ దరఖాస్తులను ఎలక్ట్రానిక్‌గా సమర్పించాలి. దీనిని https://issu.ola.om/sign-up వద్ద యాక్సెస్ చేయవచ్చు. దీనిని పాటించని సంస్థలు అమలులోకి వచ్చే తేదీ నుండి వర్తించే చట్టాలు , నిబంధనలకు అనుగుణంగా చట్టపరమైన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు.   

లాజిస్టిక్స్ రంగంలో ప్రొఫెషనల్ అక్రిడిటేషన్ వృత్తుల జాబితా:

రిఫ్రిజిరేటెడ్ ట్రక్ డ్రైవర్ (ట్రాక్టర్-ట్రైలర్)

వాటర్ ట్యాంకర్ డ్రైవర్ (ట్రాక్టర్-ట్రైలర్)

ట్రాక్టర్ హెడ్ డ్రైవర్ (ట్రైలర్)

వేస్ట్ ట్రాన్స్‌పోర్ట్ ట్రక్ డ్రైవర్

ఫుడ్ డెలివరీ ప్రతినిధి

ఫుడ్ డెలివరీ సూపర్‌వైజర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com