ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా బొప్పాయి
- July 15, 2016
బొప్పాయి పండు తినడానికి చాలా రుచిగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఈ పండు తినడం ఎంతో మేలు. ఈ పండు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బొప్పాయిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. భోజనం చేశాక బొప్పాయి పండు తింటే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. బొప్పాయి తినడం వల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడడాన్ని అరికట్టవచ్చు.
బొప్పాయి పండులో శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో ఫ్లావనాయిడ్స్, మినరల్స్, పొటాషియం, కాపర్, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలుంటాయి. బొప్పాయి ఆరోగ్యాన్ని పెంపొందించటమే కాకుండా, శరీరానికి కావలసిన పోషకాలను సమృద్దిగా అందిస్తుంది. బొప్పాయిపండులో తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్ జీవక్రియను మెరుగుపరుస్తుంది. బొప్పాయి తినడం వల్ల శరీర బరువును తగ్గిస్తుంది.
బొప్పాయి పండును రోజు తినడం వల్ల కొవ్వు పదార్థాల వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రమాదాల నుంచి రక్షణ ఏర్పడటమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అలసట, మార్నింగ్ సిక్ నెస్, అనారోగ్య సమస్యలు నివారించడానికి బొప్పాయి సహకరిస్తుంది. రోజులో రెండు సార్లు బొప్పాయి పండు తినటం వల్ల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. క్యాన్సర్ నివారించడానికి బొప్పాయి ఉపయోగపడుతుంది. ఇందులో బీటా కెరోటిన్, ల్యూటీన్, క్సాంతిన్, సిప్రోటాక్సింతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.
ఇవి క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. పొట్ట, పేగులలో హాని కలిగించే విష పదార్థాలకు టానిక్ లా పనిచేస్తుంది బొప్పాయి. బొప్పాయి పండు తినటం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉండటంతో పాటు కంటి చూపును మెరుగుపరుస్తుంది. బొప్పాయి పండు తియ్యగా ఉన్నప్పటికీ.. బీపీ పేషంట్స్ కి మంచి పరిష్కారం. మధుమేహంను కంట్రోల్ చేయడానికి పపాయ ఫ్రూట్ సహకరిస్తుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న బొప్పాయిని ప్రతిరోజు తినడం మరిచిపోకూడదు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







