కొబ్బరి పూరీ
- July 15, 2016
కావలసిన పదార్దములు : కొబ్బరి తురుము : కప్పు , పంచదార : మూడు కప్పులు , మైదా : రెండు కప్పులు , నూనె : నాలుగు కప్పులు , యాలకులు పొడి : టీ స్పూన్ , జీడిపప్పులు, బాదం పప్పులు : కప్పు
తయారుచేయు విధానం :
మైదాను కొద్దిగా నీళ్ళు పోసి పూరీ పిండిలా కలిపి అరగంట పక్కన పెట్టాలి. జీడిపప్పులు, బాదాం పప్పులు చిన్నచిన్న ముక్కలుగా చేసి పక్కనపెట్టాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి కొబ్బరి తురుము, కప్పు పంచదార వేసి కలుపుకోవాలి. పంచదార కరిగి కొబ్బరి ఉడుకుతుంది. కొబ్బరి, పంచదార కలిసి ముద్దగా అవ్వుతుండగా యాలకుల పొడి, జీడిపప్పుముక్కలు వేసి స్టవ్ మీద నుండి దించి చల్లారనివ్వాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. కలిపిన మైదాను చిన్నచిన్న ఉండలుగా చేసి పూరీలా ఒత్తి, దీనిఫై కొబ్బరి మిశ్రంమం పెట్టి, పైన వేరే పూరీ పెట్టి చుట్టూ అంచులు నొక్కాలి. ఇలా అన్నీ చేసుకొని కాగే నూనెలో దోరగా వేపి తియ్యాలి. ఇప్పుడు మిగిలిన మూడు కప్పుల పంచదారలో కొద్దిగా నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి పాకం పట్టాలి. తీగపాకం వచ్చాక స్టవ్ ఆపి వేయించిన కొబ్బరి పూరీలను వేసి రెండు నిముషాలు ఉంచి వేరే ప్లేటులో పెట్టుకోవాలి. అరగంట ఆగి డబ్బాలో పెట్టి నిల్వ చేసుకో వచ్చు. అంతే కొబ్బరి పూరీలు రెడీ.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







