2026 నాటికి కువైట్ యూనిఫైడ్ డిజిటల్ లీజ్ ప్లాట్‌ఫామ్‌..!!

- July 23, 2025 , by Maagulf
2026 నాటికి కువైట్ యూనిఫైడ్ డిజిటల్ లీజ్ ప్లాట్‌ఫామ్‌..!!

కువైట్: రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆధునీకరించడం, అద్దె ఒప్పందాలలో పారదర్శకతను పెంచడం వైపు ఒక ప్రధాన అడుగుగా కువైట్ 2026 నాటికి ఏకీకృత ఎలక్ట్రానిక్ లీజ్ అగ్రిమెంట్ వ్యవస్థను ప్రారంభించనుంది. న్యూ కువైట్ 2035 విజన్‌లో భాగమైన ఈ ప్లాట్‌ఫామ్, పాత పేపర్ ఆధారిత ఒప్పందాల వల్ల కలిగే సమస్యలను తొలగించడం లక్ష్యంగా పెట్టుకుందని అధికారులు తెలిపారు.

పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్, వాణిజ్య మంత్రిత్వ శాఖ , న్యాయ మంత్రిత్వ శాఖ వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు రియల్ ఎస్టేట్ అసోసియేషన్‌ల మధ్య దాదాపు మూడు సంవత్సరాల సహకారం ఫలితంగా ఈ వ్యవస్థ రూపొందిందని అన్నారు.  ఇది చట్టపరమైన ప్రక్రియల వేగవంతానికి సహయం చేస్తుందన్నారు. అద్దె ఒప్పందాలలో ట్యాంపరింగ్‌ను 70% వరకు నిరోధించడం, కోర్టు కేసులను తగ్గించడం, సివిల్ రిజిస్ట్రీ వ్యవస్థ పనితీరును 60% కంటే ఎక్కువ మెరుగుపరచడం దీని ప్రధాన లక్ష్యాలలో ఒకటి అని తెలిపారు. 

ప్రాపర్టీ వివరాలను ట్రాక్ చేయడం, ధృవీకరించడం, ఇంటి యజమానులు, అద్దెదారుల స్థానాన్ని గుర్తించడం, ప్రతి యూనిట్‌లో ఎంత మంది నివసిస్తున్నారో తెలుసుకోవడం ద్వారా భద్రతకు మద్దతు ఇవ్వడం వంటి ముఖ్య లక్షణాలు ఉంటాయన్నారు. అదే సమయంలో మనీలాండరింగ్‌ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాటంలో సహాయపడుతుందని భావిస్తున్నారు.

విషాదకరమైన మంగాఫ్ అగ్నిప్రమాదం తర్వాత, ప్రభుత్వ అధికారులు ప్రజా భద్రతను బలోపేతం చేయడానికి భవనం ఆక్యుపెన్సీ, అద్దెదారుల సమాచారాన్ని ఖచ్చితంగా ట్రాక్ చేయడానికి ఈ కొత్త వ్యవస్థను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com