బాక్సాఫీస్ వద్ద సౌదీ సినిమా రికార్డు..SR100 మిలియన్ల రెవెన్యూ..!!
- July 23, 2025
రియాద్: సౌదీ సినిమాలు 2025 ప్రారంభం నుండి బాక్స్ ఆఫీస్ ఆదాయాన్ని SR100 మిలియన్లకు పైగా ఆర్జించాయి. ఇది సౌదీ చిత్ర పరిశ్రమ వేగవంతమైన వృద్ధిని, స్థానిక కంటెంట్‌పై ప్రేక్షకుల విశ్వాసం పెరుగుతుండటాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. సౌదీ ఫిల్మ్ కమిషన్ ప్రకారం. ఎనిమిది స్థానిక నిర్మాణాలు ఈ సంవత్సరం మొత్తం బాక్సాఫీస్ వాటాలో 19%ని స్వాధీనం చేసుకున్నాయి. వీటిలో షబాబ్ అల్-బాంబ్ 2, హోబల్, అల్-జర్ఫా, ఇసాఫ్, ఫఖ్ర్ అల్-సువైది, లీల్ నహర్, సైఫీ, తష్విష్ ఉన్నాయి.
జూలై 13–19 వారంలో, సౌదీ సినిమాస్ మొత్తం టిక్కెట్ల అమ్మకాలలో SR26 మిలియన్లను నమోదు చేశాయి. చార్టులలో అగ్రస్థానంలో ఉన్న అమెరికన్ చిత్రం F1 ది మూవీ SR26.3 మిలియన్లతో నిలిచింది. ఆ తర్వాత సౌదీ చిత్రం అల్-జర్ఫా SR22.6 మిలియన్లతో రెండవ స్థానంలో ఉంది. సూపర్‌మ్యాన్ SR7.7 మిలియన్లతో మూడవ స్థానంలో ఉండగా, ఈజిప్షియన్ చిత్రం అహ్మద్ అండ్ అహ్మద్ SR3.5 మిలియన్లతో నాల్గవ స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







