టర్కీ అంతటా కర్ఫ్యూ

- July 15, 2016 , by Maagulf
టర్కీ అంతటా కర్ఫ్యూ

 టర్కీలో సైనికులు తిరుగుబాటు చేశారు. టర్కీ అంతటా కర్ఫ్యూ విధించారు. దేశంలో సైనిక చట్టం అమలులోకి వచ్చింది. ప్రభుత్వాన్ని తమ అధీనంలోకి తీసుకున్నట్లు ఆర్మీ ప్రకటించింది. టర్కీ గగనతలంలో సైనిక విమానాలు, హెలికాప్టర్లు పహరా కాశాయి.పార్లమెంట్‌పై బాంబు దాడులు జరిగాయి. ఈ ఘటనలో 17మంది పోలీసులు మృతి చెందారు. దేశంలో నిరంకుశ పాలన, పెరిగిన ఉగ్రదాడుల వల్ల తాము తిరుగుబాటు చేశామని టర్కీ సైన్యం ప్రకటించింది. జాతీయ టీవీ చానెల్‌, రేడియో కార్యాలయాలను సైన్యం అధీనంలోకి తీసుకుంది. సైనిక తిరుగుబాటును టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్‌ ఖండించారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి తనకు మద్దతు తెలిపాలని ఎర్దోగన్ పిలుపునిచ్చారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com