సౌదీ అరేబియాలో 22వేల మందికి పైగా అరెస్టు
- July 27, 2025
రియాద్: సౌదీ అరేబియాలో వారం రోజుల పాటు జరిగిన క్షేత్రస్థాయి తనిఖీలలో రెసిడెన్సీ, లేబర్, బార్డర్, భద్రతా చట్టాలను ఉల్లంఘించిన సుమారు 22,500 మంది వ్యక్తులను అరెస్టు చేశారు.వీరిలో 1,687 మంది వ్యక్తులు అక్రమంగా సౌదీ అరేబియాలోకి ప్రవేశిస్తూ పట్టుబడ్డారు. రాజ్యం నుండి చట్టవిరుద్ధంగా బయటకు వెళ్లడానికి ప్రయత్నించినందుకు 40 మంది వ్యక్తులను అరెస్టు చేశారు.
11,000 మంది వ్యక్తులను బహిష్కరించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. మరో 11,000 మందిని ట్రావెల్ డాక్యుమెంట్స్ ప్రాసెసింగ్ కోసం వారి దౌత్య కార్యకలాపాలకు పంపారు.
చట్టాలను ఉల్లంఘించినవారికి ఎంట్రీ, సహాయం, ఆశ్రయం కల్పించే ఎవరైనా 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష, ఒక మిలియన్ రియాల్స్ వరకు జరిమానా విధిస్తారని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇటువంటి నేరాలను రియాద్, తూర్పు ప్రావిన్స్‌లో 911.. మిగిలిన ప్రాంతాలలో 999, 996 నంబర్‌లకు నివేదించాలని పౌరులను కోరింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







