యూఏఈలో సెప్టెంబర్ 9-28 తేదీల్లో T20 ఆసియా కప్ టోర్నమెంట్‌

- July 27, 2025 , by Maagulf
యూఏఈలో సెప్టెంబర్ 9-28 తేదీల్లో T20 ఆసియా కప్ టోర్నమెంట్‌

యూఏఈ: T20 ఆసియా కప్ టోర్నమెంట్‌ తేదీలను నిర్వాహకులు ప్రకటించారు. యూఏఈలో  T20 ఆసియా కప్ టోర్నమెంట్‌ను సెప్టెంబర్‌లో నిర్వహించనున్నారు. ACC అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వి ఖరారు చేశారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో జరగనుంది.త్వరలోనే పూర్తి షెడ్యూల్ ను విడుదల చేస్తామని తెలిపారు.
ACCలోని ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక టోర్నమెంట్‌కు ఆటోమేటిక్ అర్హత సాధించారు. 2024 ACC మెన్స్ ప్రీమియర్ కప్‌లో టాప్ మూడు స్థానాల్లో నిలిచిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, హాంకాంగ్ జట్లు కూడా ఈ టోర్నమెంట్‌లో తలపడనున్నాయి.భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కనీసం మూడు ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. UAE లోని దుబాయ్, అబుదాబి  వేదికలుగా మ్యాచులను నిర్వహించనున్నారు.

ఆసియా కప్ 2025లో ఇండియా-పాకిస్థాన్ జట్లు కనీసం ఒకసారి గ్రూప్ దశలో తలపడతాయి. భారత్, పాకిస్తాన్ మధ్య మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 7న దుబాయ్‌లో జరగనుంది. ఆ తర్వాత, సూపర్ ఫోర్ దశకు ఇరు జట్లు అర్హత సాధిస్తే(సెప్టెంబర్ 14న ) మరోసారి తలపడతాయి. మెరుగైన అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్‌కు చేరుకుంటే.. టైటిల్ కోసం(సెప్టెంబర్ 21న ) మూడోసారి తలపడతాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com