అల్ ఐన్ గార్డెన్ సిటీని ముంచెత్తిన భారీ వర్షాలు. ఆరెంజ్ అలర్ట్ జారీ

- July 27, 2025 , by Maagulf
అల్ ఐన్ గార్డెన్ సిటీని ముంచెత్తిన భారీ వర్షాలు. ఆరెంజ్ అలర్ట్ జారీ

యూఏఈ: యూఏఈలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి. ఇది నివాసితులకు మండుతున్న వేసవి వేడి నుండి ఉపశమనం కలిగించింది. అల్ ఐన్ గార్డెన్ సిటీని భారీ వర్షాలు ముంచెత్తాయి.అలాగే, యూఏఈ- ఒమన్ మధ్య సరిహద్దు దాటే ప్రదేశమైన ఖత్మ్ అల్ షిక్లాలో వర్షం, ఉరుములతో కూడిన వర్షాల వీడియోలను సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
బలమైన గాలులతో పాటుగా ఈదురుగాలులు వీచిన్నట్లు చూడవచ్చు. ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా నివాసితులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. లోయలకు వెళ్లకుండా ఉండాలని అబుదాబి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల, వాతావరణ పరిస్థితుల కారణంగా అమలులో ఉన్న సవరించిన వేగ పరిమితులను పాటించాలని కూడా వారు కోరారు. ఈమేరకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జాతీయ వాతావరణ కేంద్రం (NCM) జారీ చేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com