కువైట్ లేబర్ మార్కెట్ లో 169 దేశాల కార్మికులు..!!
- July 29, 2025
కువైట్ః కువైట్ విదేశీ కార్మికులకు అగ్ర గమ్యస్థానంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. స్థిరమైన జీవన పరిస్థితులు, ఆధునిక మౌలిక సదుపాయాలు, కార్మికులకు అనుకూలమైన వాతావరణం కారణంగా.. కువైట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులను ఆకర్షిస్తోంది.
ప్రస్తుతం, 169 విభిన్న దేశాలకు చెందిన విదేశీ కార్మికులు కువైట్‌లో పనిచేస్తున్నారు. ఈ వైవిధ్యం కువైట్ సమాజం, భిన్నమైన సాంస్కృతిక స్వభావాన్ని హైలైట్ చేస్తుందని తెలిపారు. ఆరోగ్యం, విద్య, నిర్మాణం, చమురు, సేవలు, సాంకేతికత వంటి అనేక ముఖ్యమైన రంగాలలో నైపుణ్యం కలిగిన కార్మికులు తమ సేవలను అందిస్తున్నారని వెల్లడించారు.
మరోవైపు, దేశ న్యాయ వ్యవస్థ కార్మికుల హక్కులను రక్షించడంలో సహాయపడుతుందన్నారు.
తాజా అధికారిక డేటా ప్రకారం.. కువైట్ మొత్తం లేబర్ ఫోర్సులో దాదాపు 2.21 మిలియన్ల మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 1.72 మిలియన్లు పురుషులు, 489,500 మంది మహిళలు ఉన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..
- యూట్యూబ్‌కు పోటీగా చైనా ‘బిలిబిలి’ వచ్చేసింది..







