సింగపూర్ లో చంద్రబాబు మూడో రోజు పర్యటన షెడ్యూల్

- July 29, 2025 , by Maagulf
సింగపూర్ లో చంద్రబాబు మూడో రోజు పర్యటన షెడ్యూల్

సింగపూర్: జూలై 29న ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన మూడో రోజు పూర్తి షెడ్యూల్‌తో గడపనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు ఆకర్షించేందుకు అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలతో ఆయన భేటీ కానున్నారు.ప్రత్యేకంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్‌టెక్, ఆరోగ్య, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులపై వివిధ సంస్థల ప్రతినిధులతో ఆయన చర్చించనున్నారు.భారత కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు యువతకు డిజిటల్ నైపుణ్యాలను అందించేందుకు యూట్యూబ్ అకాడమీతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ కార్యక్రమంలో యూట్యూబ్ ప్రతినిధులు గౌతమ్ ఆనంద్, అజయ్ విద్యాసాగర్, శ్రీనివాస్ సూరపనేనితో కలిసి సీఎం పాల్గొంటారు.

గూగుల్ క్లౌడ్‌తో సమావేశం
ఉదయం 7.30 గంటలకు గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో సమావేశమై డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, క్లౌడ్ సేవలు, డిజిటల్ ఇండియా లక్ష్యాలపై చర్చిస్తారు.ఉదయం 8 గంటలకు మైక్రో ఎలక్ట్రానిక్స్‌లో ప్రసిద్ధి చెందిన మురాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో భేటీ అవుతారు. తయారీ, పరిశోధన యూనిట్లను ఏపీలో ఏర్పాటు చేసే అంశంపై చర్చించనున్నారు.

క్యారియర్, విల్మర్ ఇంటర్నేషనల్‌తో భేటీలు
ఉదయం 8.30 గంటలకు క్యారియర్ సంస్థ ప్రతినిధులతో పరిశ్రమల స్థాపనపై సంప్రదింపులు జరుపుతారు. ఉదయం 9 గంటలకు విల్మర్ ఇంటర్నేషనల్ సీఈఓ క్వాక్ కూన్ హాంగ్‌తో భేటీ అవుతారు. ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతుల అవకాశాలపై చర్చిస్తారు.ఉదయం 9.30 గంటలకు షాంగ్రీలా హోటల్‌లో జరిగే బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో సీఎం పాల్గొంటారు. ఇందులో ఐటీ, సెమికండక్టర్లు, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, కృత్రిమ మేధస్సు, ఫిన్‌టెక్ వంటి అంశాలపై చర్చించనున్నారు.

సింగపూర్ నేతలతో కీలక భేటీలు
మధ్యాహ్నం 12 గంటలకు సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నంతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు మాజీ ప్రధాని లీ హ్సియన్ లూంగ్‌తో భేటీ అవుతారు.మధ్యాహ్నం 2.45 గంటలకు జురాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్‌ను సీఎం, మంత్రుల బృందం సందర్శించనున్నారు. పారిశ్రామిక వాడలు, లాజిస్టిక్స్ హబ్‌ల ఏర్పాటు పై అధ్యయనం చేస్తారు.

టీవీఎస్ మోటార్స్‌ ప్రతినిధులతో సమావేశం
తర్వాత టీవీఎస్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణుతో సమావేశమై వాహన తయారీ, ఆటోమొబైల్ పార్కులపై చర్చిస్తారు.రోజు చివర్లో బిజినెస్ నెట్‌వర్కింగ్ విందులో పాల్గొని అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలతో నూతన ఆవిష్కరణలు, గ్లోబల్ పెట్టుబడులపై చర్చించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com