బహ్రెయిన్ లో రొయ్యలు, చేపల వేటపై నిషేధం ఎత్తివేత..!!
- July 29, 2025
మానామాః రొయ్యలు, చేపల వేటపై కాలానుగుణ నిషేధాన్ని ఆగస్టు 1 నుండి అధికారికంగా ఎత్తివేస్తున్నట్లు బహ్రెయిన్ సుప్రీం కౌన్సిల్ ఫర్ ఎన్విరాన్మెంట్, ప్రకటించింది. ఫిబ్రవరి ప్రారంభంలో ఈ నిషేధం విధించారు.
సముద్ర జీవవైవిధ్యాన్ని కాపాడటానికి, ఫిషింగ్ కార్యకలాపాలను నియంత్రించడానికి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మెరైన్ రిసోర్సెస్ తన ప్రయత్నాలను కొనసాగిస్తుందని కౌన్సిల్ తెలిపింది. ఈ ప్రయత్నాలు అంతర్జాతీయ పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయని స్పష్టం చేసింది.
నిషేధ కాలంలో స్థానిక మత్స్యకారులు అందించిన సహకారాన్ని అధికారులు ప్రశంసించారు. పర్యావరణ లక్ష్యాలను సాధించడానికి, బహ్రెయిన్ సముద్ర పర్యావరణ వ్యవస్థల దీర్ఘకాలిక ప్రయోజనం కోసం ఇలాంటి నిర్ణయాలు దోహదం చేస్తాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..
- యూట్యూబ్‌కు పోటీగా చైనా ‘బిలిబిలి’ వచ్చేసింది..
- CBSE–JEE విధానం విద్యార్థుల్లో ఆలోచనా వైవిధ్యాన్ని తగ్గిస్తోంది: బిట్స్ వీసీ రామగోపాల్ రావు







