దుబాయ్‌లో కొత్తగా 61 మసీదులు
- July 16, 2016
దుబాయ్‌లో కొత్తగా 61 మసీదులు నిర్మిస్తున్నట్లు ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఛారిటబుల్ యాక్టివిటీస్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. దుబాయ్ స్టాటిస్టిక్ సెంటర్ వివరాల ప్రకారం 2015 నాటికి 2,036 మసీదులు దుబాయ్‌లో ఉన్నాయి. 2014తో పోల్చితే 20.3 శాతం ఎక్కువ. 2014లో వీటి సంఖ్య 1,692. దుబాయ్‌లో ఎక్కడికక్కడ ఒకటి లేదా రెండు మసీదులు ప్రస్తుతానికి ఉన్నాయి. పాపులేషన్‌కి తగ్గట్టుగా కొత్త మసీదుల నిర్మాణం జరుగుతోంది. 61 మసీదుల నిర్మాణం కోసం 398 మిలియన్ దిర్హామ్‌లు ఖర్చవుతోంది. వీటిల్లో బుర్ దుబాయ్‌లో 30, డేరాలో 26, పాత మసీదుల్ని పూర్తిగా మార్చేసి కొత్తగా మరో ఐదింటిని నిర్మిస్తున్నారు. కొన్ని మసీదులు లోకల్ స్టయిల్‌లోనూ ఇంకొన్ని ఫతిమిద్ స్టైల్‌లోనూ, మిగతావి ఒట్టోమాన్ స్టైల్ లేదా మోడర్న్ ఆర్కిటెక్చరల్ స్టైల్‌లోనూ నిర్మితమవుతాయి. మొత్తం 988 మసీదుల్ని దుబాయ్‌లో ఇటీవల నిర్మించారు. పూర్తిగా అనుకున్న ప్రకారం మసీదుల నిర్మాణం జరిగితే 52,600 మందికి అవి అకామడేట్ చేస్తాయి. యూఏఈలో జూన్ 2014 నాటికి 5,036 మసీదులు ఉన్నట్లు జనరల్ అథారిటీ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోమెంట్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







