మిడ్ డే బ్రేక్ రూల్ పాటించిన 99.8 శాతం కంపెనీలు
- July 16, 2016
మినిస్ట్రీ ఆఫ్ హ్యమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ వివరాల ప్రకారం 99.8 శాతం కంపెనీలు మిడ్ డే బ్రేక్ రూల్‌ని నిబంధనలకు అనుగుణంగా పాటించినట్లు తెలుస్తుంది. 29,185 కంపెనీలు జులై మధ్యంతరం నాటికి పూర్తిగా ఈ మిడ్ డే బ్రేక్‌ని పాటించాయనీ, 47 సంస్థలు మాత్రం ఆ రూల్‌ని అతిక్రమించాయని పేర్కొంది మినిస్ట్రీ. 29,232 తనిఖీల్ని మొత్తం 18 టీమ్‌లు ఈ కాలంలో నిర్వహించాయి. మిడ్ డే బ్రేక్ రూల్‌ని పాటించిన సంస్థలను మినిస్ట్రీ అభినందించింది. అలాగే రూల్‌ని అతిక్రమించిన సంస్థలకు ఒక్కో వర్కర్కిగాను 5,000 దిర్హామ్‌ల ఫైన్ విధించింది. ఈ ఫైన్ 50,000 దిర్హామ్‌ల వరకు ఉంటుంది. రోజువారీ పనిదినాలు 8 గంటలకు మించి ఉండకూడదనీ, ఓవర్‌టైమ్ అలవెన్స్‌లను కార్మికులకు తప్పనిసరిగా చెల్లించాలని అధికారులు చెప్పారు. బ్యాన్ చేసిన సమయాల్లో కార్మికులు ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచెయ్యకూడదని, సంస్థలు ఈ విషయంలో కార్మికులకు సహకరించాలని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







