'కూలీ' నుంచి పవర్‌హౌస్ సాంగ్ రిలీజ్

- July 30, 2025 , by Maagulf
\'కూలీ\' నుంచి పవర్‌హౌస్ సాంగ్ రిలీజ్

సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'కూలీ'కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో తన విజయాలని కొనసాగిస్తున్నారు. ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన కూలీలో రీసెంట్ కుబేర తో బ్లాక్ బస్టర్ అందుకున్న కింగ్ నాగార్జున పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్‌ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్ సినిమాపై భారీ క్రేజ్‌ను నెలకొల్పాయి. ‘చికిటు’, మోనికా సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి.  

తాజాగా మేకర్స్ కూలీ నుంచి పవర్‌హౌస్ సాంగ్ రిలీజ్ చేశారు. రాక్ స్టార్ ఆనిరుధ్ ఈ పాటని పవర్ ప్యాక్డ్ సెన్సేషనల్ నెంబర్ కంపోజ్ చేశారు.

రాంబాబు గోసాల రాసిన లిరిక్స్ సూపర్ స్టార్ రజనీ ఇమేజ్ కి పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యాయి. అరివు & కోరస్ వోకల్స్ మెస్మరైజింగ్ వున్నాయి.

పవర్‌హౌస్ సాంగ్ లో రజనీ పవర్ ఫుల్ ప్రజెన్స్ నెక్స్ట్ లెవల్ లో వుంది. అందరినీ ఆకట్టుకున్న ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూలీ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది.  

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా విడుదల చేయనుంది.

ఈ చిత్రంలో సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతీ హాసన్, మహేంద్రన్ వంటి ప్రముఖులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

కలానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టాప్  టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. ఆనిరుధ్ సంగీతం, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఫిలోమిన్ రాజ్.

ఈ చిత్రం 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ కానుంది.

నటీనటులు: రజనీకాంత్, నాగార్జున, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, మహేంద్రన్
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
నిర్మాత: కళానిధి మారన్
బ్యానర్: సన్ పిక్చర్స్
రిలీజ్: ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
డిఓపీ: గిరీష్ గంగాధరన్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
పీఆర్వో: వంశీ-శేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com