ఒమన్‌లో టీచర్ల కొరత
- July 16, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఒమన్‌లో టీచర్ల కొరత ఉన్నట్లు వెల్లడించింది. 100 మంది స్టూడెంట్స్‌కి కేవలం ఒకే టీచర్ అందుబాటులో ఉన్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. షురా కౌన్సిల్, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మదిహా అల్ షైబానితో జరిగిన సమావేశంలో ఓ మెంబర్, స్కూళ్ళలో పరిమితికి మించి విద్యార్థులు ఉంటున్నారనీ, వారికి తగినట్లుగా టీచర్లు లేరనే విషయాన్ని ప్రస్తావించారు. అల్పెన్ క్యాపిటల్స్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ సెక్టార్ రిపోర్ట్ 2016 ప్రకారం 2020 నాటికి 1,115,486 విద్యార్థులు ఉంటారని ఓ అంచనా. 3.6 పెరుగుదలతో 2020 నాటికి 12.6 మిలియన్ల నుంచి 15 మిలియన్లకు విద్యార్థుల సంఖ్య చేరనుందని ఓ అంచనా. ఒమన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మిగతా జిసిసి దేశాలతో పోల్చితే ఎక్కువగా విద్యార్థుల్ని కలిగి ఉంటారని నివేదిక వెల్లడిస్తోంది. అయితే విద్యార్థుల పెరుగుదలకు తగ్గట్లుగా టీచర్ల పెరుగుదల కనిపించడంలేదు. ఆ విభాగంలో తగు చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







