భారతీయులే ప్రపంచంలో అత్యధిక వలసదారులు
- July 31, 2025
ప్రపంచ వ్యాప్తంగా వలసదారుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారని ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన డేటా స్పష్టం చేసింది.2024 నాటికి 1.85 కోట్ల మంది భారతీయులు విదేశీ దేశాలలో నివసిస్తున్నారని,ఇది ప్రపంచ వలసదారులలో సుమారు 6 శాతం అని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది.మొత్తం 30.4 కోట్ల మంది అంతర్జాతీయ వలసదారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని తెలిపింది.2020లో ఈ సంఖ్య 27.5 కోట్లుగా ఉండగా, నాలుగేళ్లలోనే గణనీయమైన వృద్ధి చోటుచేసుకుంది.అంతర్జాతీయ వలసదారుల సంఖ్యలో భారత్ మొదటి స్థానంలో ఉంది.భారతీయుల తర్వాత చైనా (1.17 కోట్లు), మెక్సికో (1.16 కోట్లు),ఉక్రెయిన్ (98 లక్షలు),రష్యా (91 లక్షలు) దేశాలు అగ్రస్థానాల్లో నిలిచాయి.ఇది భారతీయుల అంతర్జాతీయ మైగ్రేషన్ స్థాయి ఇతర దేశాలతో పోలిస్తే ఎంత ఎక్కువగా ఉందో చూపిస్తుంది.
భారతీయ డయాస్పోరా ఉన్న ప్రధాన దేశాలు
ఒకప్పుడు భారతీయ వలసదారులు ప్రధానంగా సౌదీ అరేబియా, పాకిస్థాన్ వంటి దేశాలకు పరిమితమయ్యేవారు.కానీ, ప్రస్తుతం పశ్చిమాసియా మరియు పశ్చిమ దేశాలకు భారీ సంఖ్యలో వలసలు పెరిగాయి.
యూఏఈ: అక్కడి మొత్తం జనాభాలో 40 శాతం భారతీయులే.యూఏఈలో 32.5 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు.అమెరికా (USA):ఇండో-అమెరికన్లు రెండో అతిపెద్ద ఆసియన్ కమ్యూనిటీగా ఉన్నారు.అమెరికాలో 31.7 లక్షల భారతీయులు నివసిస్తున్నారు.సౌదీ అరేబియా: సుమారు 19.5 లక్షల మంది భారతీయులు ఉన్నారు.కెనడా: 10.2 లక్షల భారతీయులు నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







