బిగ్ నార్కోటిక్స్ సీజ్..పలువురు అరెస్ట్..!!

- August 02, 2025 , by Maagulf
బిగ్ నార్కోటిక్స్ సీజ్..పలువురు అరెస్ట్..!!

మనామా: వేర్వేరు కేసుల్లో సుమారు 14 కిలోల మాదకద్రవ్యాలను అధికారులు సీజ్ చేశారు. దీని వీధి విలువ BD24,000 కంటే ఎక్కువ ఉంటుందని తెలిపారు. అలాగే, 20 - 49 సంవత్సరాల మధ్య వయస్సు గల వివిధ దేశాలకు చెందిన అనేక మంది వ్యక్తులు ఇందులో ఉన్నారని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్‌లోని యాంటీ-నార్కోటిక్స్ డైరెక్టరేట్ పేర్కొన్నది. కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసే ముందు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు తెలిపింది.

మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా అక్రమ రవాణాకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని 24 గంటల హాట్‌లైన్ 996 ద్వారా లేదా 996@ interior.gov.bh ఇమెయిల్ ద్వారా నివేదించాలని కోరారు. సమాచారం అందజేసిన వారి వివరాలను గోప్యంగా పెడతామని తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com