5 నియమాలు తో చర్మం ఆరోగ్యం..
- July 16, 2016
అందంగా, ఆరోగ్యంగా చర్మం కనిపించాలంటే అదే పనిగా లోషన్లూ, క్రీంలూ రాసుకోవడం ఒక్కటే పరిష్కారం కాదు. వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉంటాయి. అవేంటంటే..
1 నిద్ర: సరిగ్గా లేకపోతే ఆ ప్రభావం చర్మంపై, రంగుపై కచ్చితంగా పడుతుంది. కంటినిండా హాయిగా నిద్రపోతున్నప్పుడు చర్మం తనకు తను మరమ్మతు చేసుకుంటుంది. దాంతో మర్నాడు తాజాగా కనిపిస్తుంది. అందుకే ఎన్ని పనులున్నా సరే.. కనీసం ఎనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. దానికి తగినట్లుగా పనుల్ని వేళకు పూర్తిచేసుకోవాలి.
2 అలంకరణ: చర్మం ఆరోగ్యంగా కనిపించాలంటే.. నిద్రపోయేముందు మేకప్ లేకుండా చూసుకోండి. అలంకరణతో నిద్రపోతే గనుక చర్మానికి గాలి తగలదు. బ్యాక్టీరియా, మురికీ చర్మంపై నిలిచి ఉంటాయి. గ్రంథులు మూసుకుపోయి, చర్మం వదులుగా మారుతుంది. ఇలాంటి సమస్యలన్నీ అదుపులో ఉంచాలంటే.. నిద్రపోయేముందు తప్పనిసరిగా అలంకరణని తొలగించాలి. చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.
3 సమతులాహారం: అదేపనిగా రోడ్డుపక్కన దొరికే చిరుతిళ్లూ, బేకరీ పదార్థాలు తీసుకోవడం వల్ల కొవ్వూ, చక్కెరా ఉప్పూ ఇతర రసాయనాలు శరీరంలోకి చేరతాయి. వాటి ప్రభావం చర్మంపైనా పడుతుంది. నిర్జీవంగా కనిపిస్తుంది. అందుకే సమతులాహారాన్ని తీసుకోవాలి. అందులోనూ పండ్లూ, కూరగాయల వినియోగాన్ని పెంచాలి. అప్పుడే చర్మం పరిశుభ్రంగా ఉంటుంది, మెరుస్తుంది.
4 పరిశుభ్రత: రాత్రిళ్లు దిండుపై తల వాలుస్తాం, చెంపకు ఫోను ఆనించి మాట్లాడతాం, చేతులతో అప్పుడప్పుడూ ముఖాన్ని తాకుతూ ఉంటాం. వీటన్నింటి వల్లా చర్మంలోకి క్రిములు సులువుగా చేరతాయి. అందుకే ఎప్పటికప్పుడు దిండు గలేబుల్ని మారుస్తూ ఉండాలి. కుదిరితే ప్రతిరోజూ ఫోనుని ఓసారి తుడవాలి. అలాగే వీలైనంతవరకూ చేతులతో ముఖాన్ని తాకకుండా చూసుకోవాలి. ముఖ చర్మాన్ని తాకే ముందు చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. ఈ జాగ్రత్తల వల్ల మొటిమల ప్రభావం చాలామటుకూ తగ్గుతుంది.
4 మృతకణాలు: చర్మం ఆరోగ్యంగా కనిపించేలా చేసేందుకు ఉపయోగపడే మరో చిట్కా ఎప్పటికప్పుడు మృతకణాలు తొలగించుకోవాలి. లేదంటే చర్మ గ్రంథులు మూసుకుపోవడం, నిర్జీవంగా కనిపించడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. వారంలో కనీసం రెండుసార్లు మృతచర్మాన్ని తొలగించుకునేలా చూసుకోవాలి. దీనివల్ల ముఖం తాజాగా, యౌవనంగా కనిపిస్తుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







