ఒమన్ లోని నాలుగు హిస్టారికల్ సైట్స్ కు చారిత్రక గుర్తింపు..!!
- August 05, 2025
మస్కట్: ఒమన్ కు చెందిన నాలుగు హెరిటేజ్ సైట్స్ అరుదైన ఘనతను సాధించాయి. అరబ్ రిజిస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ మరియు అర్బన్ హెరిటేజ్‌లో చోటు సంపాదించాయి. జాలాన్ బని బు అలీలోని విలాయత్‌లోని అల్ హమౌదా మసీదు, సోహార్ మరియు నిజ్వా చారిత్రాత్మక కోటలతోపాటు నిజ్వాలోని విలాయత్‌లోని అల్ అక్ర్ అనే పురాతన గ్రామంలోని అల్ షావద్నా మసీదు ఈ జాబితాలో చోటు సంపాదించాయి. లెబనీస్ రిపబ్లిక్లో జరిగిన అరబ్ స్టేట్స్‌లోని అబ్జర్వేటరీ ఆఫ్ ఆర్కిటెక్చరల్ మరియు అర్బన్ హెరిటేజ్ 10వ సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు.
అరబ్ లీగ్ ఎడ్యుకేషనల్, కల్చరల్ అండ్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్ (ALECSO) తో అనుబంధంగా ఉన్న వాటిల్లో అబ్జర్వేటరీ ఆఫ్ ఆర్కిటెక్చరల్ అండ్ అర్బన్ హెరిటేజ్ ఒకటి. ఇది అరబ్ దేశాలలో ఆర్కిటెక్చరల్ మరియు అర్బన్ హెరిటేజ్‌ను డాక్యుమెంట్ చేయడం, పరిరక్షణ ప్రయత్నాలకు సహకరించడంపై దృష్టి పెడుతుంది.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







