దుబాయ్ లో స్టూడియోలు, 1BHK అద్దె ధరలకు రెక్కలు..కారణం అదేనా?
- August 05, 2025
దుబాయ్: దుబాయ్‌లోని అనేక ప్రాంతాలలో స్టూడియో మరియు సింగిల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌ల అద్దె రేట్లు దూసుకుపోతున్నాయి. అపార్ట్‌మెంట్‌లు, విల్లాలను అక్రమంగా విభజించి అద్దెలకు ఇవ్వడంపై ఇటీవల ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యలో అద్దెల ధరలకు రెక్కలు వచ్చాయి.
ఇటీవల కాలంలో దుబాయ్ మునిసిపాలిటీ అధికారులు తీసుకుంటున్న చర్యలతో అద్దె ధరలు స్వల్పంగా పెరిగాయని, ముఖ్యంగా స్టూడియోలు మరియు సింగిల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌ల కోసం భారీ డిమాండ్ ఏర్పడిందని ప్రాపర్టీ జోన్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ స్వప్న టెక్‌చందాని తెలిపారు.అదే సమయంలో అక్రమ పాటిషన్లను తొలగించడంతో... పెద్ద ప్లాట్ల సరఫరా అధికంగా ఉందని, దాంతో ధరల్లో తగ్గుదల కనిపిస్తుందన్నారు.
అల్ రిగ్గా, అల్ మురఖ్ఖబాత్, అల్ సత్వా మరియు అల్ రఫా వంటి ప్రాంతాలలో దుబాయ్ మునిసిపాలిటీ,దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్ చర్యలు తీసుకోవడంతో ఆయా ఏరియాల్లో అద్దెల ధరలకు రెక్కాలొచ్చాయని కోల్డ్‌వెల్ బ్యాంకర్ మేనేజింగ్ డైరెక్టర్ అయ్మాన్ యూసఫ్ తెలిపారు. ఈ క్రమంలో చాలా మంది అద్దెదారులు అల్ నహ్దా వంటి శివార్లకు వెళుతున్నారని పేర్కొన్నారు. మరికొందరు షార్జా మరియు అజ్మాన్ వంటి ఇతర ఎమిరేట్‌లకు కూడా మకాం మార్చుతున్నారని, దాంతో గత కొన్ని రోజులుగా 20శాతం అద్దె ధరలు పెరిగాయని యూసఫ్ తెలిపారు. అదే సమయంలో సింగిల్ బెడ్ రూం ప్లాట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందన్నారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







