పౌర రక్షణ రంగాలలో ఒమన్, సౌదీ అరేబియా చర్చలు..!!
- August 07, 2025
రియాద్: సివిల్ డిఫెన్స్ కు సంబంధించి సహకారంపై ఒమన్, సౌదీ అరేబియాలు చర్చలు జరిపాయి. ఒమన్ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ చైర్మన్ మేజర్ జనరల్ సులైమాన్ అలీ అల్ హుస్సేనీ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం సౌదీ అరేబియాలోని పౌర రక్షణ డైరెక్టరేట్ జనరల్‌ను సందర్శించింది.
పౌర రక్షణ రంగంలో నైపుణ్యాన్ని షేర్ చేసుకోవడం, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే చర్యలను సమీక్షించారు.అంతకుముందు ఒమన్ ప్రతినిధి బృందాన్ని సౌదీ అరేబియా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ డాక్టర్ హమౌద్ సులేమాన్ అల్-ఫరాజ్ స్వాగతం పలికారు. అనంతరం సౌదీ సివిల్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ను సందర్శించారు. అ సందర్భంగా సివిల్ డిఫెన్స్ సిబ్బందికి వివిధ స్థాయిలలో అందించే ప్రత్యేక శిక్షణా కార్యక్రమాల గురించి వివరించారు.
తాజా వార్తలు
- భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన
- జాతీయ రహదారి పనులపై ఎంపీ బాలశౌరి సమీక్ష
- ‘దాదా’- మైసూరులో షూటింగ్ పునః ప్రారంభించిన బాలకృష్ణ
- విజయవాడ ఉత్సవ్–2026కు తమిళనాడు ముఖ్యమంత్రికి ఆహ్వానం
- యూఏఈ-భారత్ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తిరుమలలో ఈ నెల 11 నుంచి 20 వరకు వీఐపీ దర్శనాలు రద్దు
- ఫోన్ స్కామ్‌తో Dh11.8 మిలియన్ మోసం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన దుబాయ్ పోలీసులు
- ఒమన్ సమీపంలో ట్యాంకర్‌పై దాడి..12 మందికి గాయాలు
- రాహుల్ గాంధీ, ప్రియాంకను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2026కు యూఏఈలో శ్రీకారం







